పెళ్లి చేస్తే ఆత్మహత్య చేసుకుంటాను అని మా నాన్నతో చెప్పాను: ఆమని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి చేస్తే ఆత్మహత్య చేసుకుంటాను అని మా నాన్నతో చెప్పాను: ఆమని

  • సినిమాల్లోకి వెళ్లాలని నాకు ఆసక్తిగా ఉండేది 
  • మా అమ్మ కూడా ప్రోత్సహించింది 
  • నాన్న మాత్రం అభ్యంతరం చెప్పారు    
"మీకు సినిమాల్లోకి రావడం ఇష్టమని తెలిసి .. మీ బంధువులంతా కూడా మిమ్మల్ని నిరుత్సాహ పరిచారట నిజమేనా?" అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆమనికి ఎదురైంది. అందుకామె స్పందిస్తూ .. " నేను రంగు తక్కువ .. పెద్దగా ఎవరితో మాట్లాడేదానిని కాదు. నాకున్న స్నేహితులు కూడా చాలా తక్కువ. అందువలన ఈ అమ్మాయి సినిమాల్లోకి వెళ్లి ఏం చేయగలదు? అనుకున్నారు.

"నన్ను అడిగే ధైర్యం లేక .. ఈ విషయాన్ని గురించి మా అమ్మను అడిగేవారు. 'ప్రయత్నం చేద్దాం .. కుదరకపోతే మానేద్దాం' అని అమ్మ చెబుతూ ఉండేది. నేను సినిమాల వైపు వెళ్లడానికి మా నాన్న ఒప్పుకోలేదు .. 'చదువుకోవడం ఇష్టం లేదంటే చెప్పు .. పెళ్లి చేసేస్తాను' అన్నారు. 'మీరు సినిమాల వైపు పంపకపోయినా ఫరవాలేదు .. పెళ్లి చేస్తే మాత్రం నేను సూసైడ్ చేసుకుంటాను' అన్నాను. ఆ తరువాత మా నాన్న కూడా అర్థం చేసుకుని సపోర్ట్ గా నిలిచారు' అంటూ చెప్పుకొచ్చారు.    
amani

More Telugu News