సచిన్ కూతురిని కిడ్నాప్ చేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్టు!
- సారా టెండూల్కర్ ను కిడ్నాప్ చేస్తానంటూ బెదిరింపు
- సచిన్ నివాసానికి ఫోన్ కాల్
- నిందితుడిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు
ఈ విషయమై సచిన్ సహాయకులు ఒకరు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుడి ఫోన్ నెంబర్ ఆధారంగా అతను నివసించే ప్రాంతాన్ని పోలీసులు తెలుసుకుని నిన్న ఉదయం అరెస్టు చేశారు. కాగా, సారా టెండూల్కర్ ను చాలాసార్లు టెలివిజన్ లో చూశానని, ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని పోలీసులకు చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఇదిలా ఉండగా, సచిన్ కుమార్తె సారా ప్రస్తుతం తన చదువు నిమిత్తం విదేశాల్లో ఉంది.