‘పద్మావతి’లో సన్నివేశాలు తొలగించమని చెప్పలేదు: సీబీఎఫ్ సీ సభ్యుడు
- ‘పద్మావతి’పై వస్తున్న వదంతులపై మండిపడ్డ వాణి త్రిపాఠి టిక్కో
- కొన్ని సన్నివేశాలను సవరించమని మాత్రమే చెప్పాం
- టైటిల్ ని ‘పద్మావత్’ గా మార్చమన్నాం .. యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చాం
కాగా, ‘పద్మావతి’ చిత్ర వివాదానికి సంబంధించి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి ఇటీవల పార్లమెంటరీ ప్యానెల్ తో సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. 16వ శతాబ్దానికి చెందిన మాలిక్ మహమ్మద్ రాసిన ‘పద్మావత్’ కవిత ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించానని, ఈ చిత్ర నిర్మాణానికి రూ.150 కోట్ల వ్యయం చేసినట్టు ప్యానెల్ తో భన్సాలీ పేర్కొన్నారు.