ఆ సినిమాలు ఇష్టం .. అవి గుర్తుకొస్తూనే ఉంటాయి: భూమిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ సినిమాలు ఇష్టం .. అవి గుర్తుకొస్తూనే ఉంటాయి: భూమిక

  • నేను చేసిన సినిమాలన్నీ ఇష్టమే 
  • వాటిలోని సీన్స్ నా మనసుకు హత్తుకున్నవే 
  • ఆ సన్నివేశాలు గుర్తొస్తూనే ఉంటాయి
తెలుగు తెరకి నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన కథానాయిక భూమిక. ఒక్క నవ్వుతోనే యూత్ హృదయాలను దోచేసిన కథానాయిక ఆమె. ఎక్స్ పోజింగ్ కి అవకాశం లేకుండా .. కేవలం నటనతోనే ఆమె ఎంతోమంది అభిమానుల మనసులను గెలుచుకున్నారు. కథానాయికగా ఆచితూచి కథలను ఎంపిక చేసుకున్న భూమిక, ప్రస్తుతం తన వయసుకు తగిన ముఖ్యమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు.

తాజాగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి'లో నటించిన ఆమె, ఎన్టీవీతో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. "గతంలో నాతో చేసిన హీరోలెవరూ నాతో టచ్ లో లేరు. వాళ్లతో చేసిన సినిమాలను మాత్రం ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే వుంటాను. నా కెరియర్లో నేను చేసిన ప్రతి సినిమా నాకు ఇష్టమే. 'ఖుషీ'.. 'నా ఆటో గ్రాఫ్ స్వీట్ మెమోరీస్' .. 'మిస్సమ్మ' ..  'సింహాద్రి' లోని ఇంటర్వెల్ బ్లాక్ సీన్ .. 'అనసూయ' ఇలా నేను చేసిన ప్రతి సినిమా నాకు నచ్చినదే .. వాటిలోని సన్నివేశాలు నా మనసుకు హత్తుకున్నవే" అంటూ చెప్పుకొచ్చారు. 
bhumika

More Telugu News