యోగిని డీసీపీ కొడుతున్న వీడియోను ఎవరు రికార్డు చేశారో తేలుస్తాం: మాదాపూర్ ఇన్ చార్జ్ డీసీపీ విశ్వప్రసాద్
- వైరల్ అయిన వీడియోపై విచారణ మొదలు
- బాధ్యతలు మాదాపూర్ ఇన్ చార్జ్ డీసీపీ విశ్వప్రసాద్ కు అప్పగింత
- ఇదే నిజమైతే తప్పుడు సంకేతాలు పంపుతున్నట్టే
- స్నేహపూర్వక పోలీసు వ్యవస్థకు విఘాతమన్న విశ్వప్రసాద్
యోగితో పాటు వచ్చిన వ్యక్తి వీడియో తీశాడా? లేక హారికతో పాటు ఉన్న వ్యక్తి తీశాడా? అన్న విషయం తేలాల్సి ఉందని చెప్పారు. యోగిపై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయని విశ్వప్రసాద్ తెలిపారు. వీడియో నిజమే అయితే, అది మంచి సంఘటన కాదని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతుందని, స్నేహపూర్వక పోలీసు వ్యవస్థకు విఘాతమని అభిప్రాయపడ్డారు.