రెండో పాపకు ఆహ్వానం ప‌లికిన క‌మెడియ‌న్‌ శ్రీనివాస‌రెడ్డి, స్వాతి దంప‌తులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెండో పాపకు ఆహ్వానం ప‌లికిన క‌మెడియ‌న్‌ శ్రీనివాస‌రెడ్డి, స్వాతి దంప‌తులు

  • ఆనందంలో కుటుంబం
  • ట్వీట్ చేసిన నటుడు
  • ఇప్ప‌టికే వారికి ఓ పాప‌
క‌మెడియ‌న్‌గా, కొన్ని సినిమాల్లో హీరోగా చేసి ప్రేక్ష‌కుల్లో ఆద‌ర‌ణ చూర‌గొన్న క‌మెడియ‌న్ శ్రీనివాస‌రెడ్డి ఇంట ఆనందం వెల్లివిరిసింది. ఇటీవ‌ల శ్రీనివాస్ రెడ్డి భార్య స్వాతి రెడ్డి ఓ పాప‌కు జ‌న్మినిచ్చారు. ఆ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో శ్రీనివాస‌రెడ్డి పంచుకున్నారు. ‘న్యూ ఎంట్రీ.. బేబీ గర్ల్‌’ అంటూ భార్య‌, ఇద్ద‌రు కూతుళ్ల‌తో దిగిన ఫొటోను శ్రీనివాసరెడ్డి షేర్ చేశారు. క‌మెడియ‌న్‌గా మంచి పేరు సంపాదించుకుని, ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’, ‘ఆనందో బ్రహ్మ’ వంటి సినిమాల్లో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించి శ్రీనివాస‌రెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే.
srinivasa reddy
swathi
tweet

More Telugu News