sudigali sudheer: స్టేజ్ పైనే 'సుడిగాలి' సుధీర్ కన్నీళ్లు పెట్టేసుకున్నాడు!

షార్ట్స్‌లో చూడండి
బుల్లితెరపై యాంకర్ గా సుధీర్ కి మంచి క్రేజ్ వుంది. 'జబర్దస్త్' కార్యక్రమంలో 'సుడిగాలి సుధీర్' గా మంచి మార్కులు కొట్టేసిన సుధీర్, 'ఢీ' డాన్స్ షోలోను యాంకర్ గా సందడి చేస్తూ ఉంటాడు. టీవీ రంగానికి రాక మునుపు .. నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందు సుధీర్ మ్యాజిక్ చేసేవాడు. ప్రొఫెషనల్ మెజీషియన్ గా ఆయన కొంతకాలం పాటు ప్రదర్శనలు ఇచ్చాడు.

 అలాంటి సుధీర్ తాజాగా 'ఢీ' స్టేజ్ పై సరదాగా మేజిక్ చేశాడు. న్యూస్ పేపర్ ను ముక్కలుగా  చింపేసి .. మళ్లీ యథాతథంగా మార్చేసి చూపించాడు. అలాగే ఖాళీ కర్చీఫ్ ను చూపించి .. అందులో నుంచి పావురాన్ని బయటికి తీసి అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు. కమెడియన్ గా మారిన తరువాత మేజిక్ ను పట్టించుకోలేదనీ, అంత అవకాశం కూడా లభించలేదని అన్నాడు. తనకి మొదట అన్నం పెట్టింది ఈ విద్యేనంటూ ఏడ్చేశాడు. దాంతో అక్కడి వాళ్లందరి మనసులు బరువెక్కాయి.     
Go Back to Shorts
sudigali sudheer

More Telugu News