చేతులెత్తేసి ఘోరంగా ఓడిపోయిన ఇంగ్లండ్... యాషెస్ కంగూరూలదే!

  • మూడో మ్యాచ్ లోనే ఫలితం
  • 41 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చిత్తు
  • 3-0 తేడాతో యాషెస్ సీరీస్ ఆసీస్ కైవసం
ఐదు టెస్టు మ్యాచ్ ల యాషెస్ సీరీస్ లో ఇంగ్లండ్ ఘోరంగా ఓడిపోయింది. మూడు టెస్టులకే సీరీస్ ఫలితం తేలిపోయింది. పెర్త్ లో జరిగిన టెస్టులోనూ ఘనవిజయం సాధించిన ఆస్ట్రేలియా, మరో రెండు టెస్టులు మిగిలుండగానే, 3-0 తేడాతో సీరీస్ ను సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్ లో ఓ దశలో 368/4 వద్ద ఉన్న ఇంగ్లండ్ మ్యాచ్ ని డ్రా చేసుకుంటుందని, తరువాతి మ్యాచ్ ల్లో పుంజుకునే అవకాశాలు ఉంటాయని ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులు భావించినా, వారి ఆశలు కలలుగానే మిగిలాయి. ఈ మ్యాచ్ లో కంగారూలు రెచ్చిపోగా, 41 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చిత్తుగా ఓడింది. ఇక మిగిలిన రెండు మ్యాచ్ లూ నామమాత్రమే అయ్యాయి. దీంతో బాక్సింగ్ డే టెస్టుపై అభిమానుల్లో ఆసక్తి పోయినట్లయిందని క్రీడా పండితులు వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Australia
England
Cricket
ashes

More Telugu News