త‌మ‌ హనీమూన్‌ ఫోటోను పోస్ట్ చేసిన అనుష్క శ‌ర్మ‌.. సెల్ఫీ వైర‌ల్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త‌మ‌ హనీమూన్‌ ఫోటోను పోస్ట్ చేసిన అనుష్క శ‌ర్మ‌.. సెల్ఫీ వైర‌ల్‌!

  • దక్షిణాఫ్రికాలో కోహ్లీ, అనుష్క శ‌ర్మ విహారం 
  • మంచుకొండ‌ల్లో నిల‌బ‌డి సెల్ఫీ
  • ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదిస్తోన్న జంట‌
బాలీవుడ్ భామ అనుష్క శ‌ర్మ త‌న హనీమూన్ ట్రిప్ ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇటీవ‌లే ఆమెకు, క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఇటలీలో పెళ్లి జ‌రిగిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని ఒక చిన్నదీవిలో వారు హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ఈ క్రమంలో మంచు కొండ‌ల్లో ఆహ్లాదకరమైన ప్రకృతి అందాల నడుమ ఈ జంట సెల్ఫీ తీసుకుంది. అనుష్క శ‌ర్మ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటో వైర‌ల్‌గా మారింది. 'చూడ ముచ్చ‌టైన జంట' అంటూ అభిమానులు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.
Anushka Sharma
Virat Kohli
honey moon

More Telugu News