Vijay Sai: మెడ నరాలు తెగి.. ఎముక విరిగి.. కోమాలోకి.. నటుడు విజయ్ సాయి మరణానికి కారణమిదే!

  • ఉరి కారణంగా మెడ నరాలు తెగాయి
  • ఆపై ఎముక విరిగి కోమాలోకి
  • వెంటనే ప్రాణాలు వదిలిన విజయ్
  • వైద్యుల ప్రాథమిక నివేదిక
వర్థమాన నటుడు కాలె విజయ్‌ సాయి మృతికి మెడ నరాలు తెగిపోవడమే కారణమని తెలుస్తోంది. సాయి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆత్మహత్య చేసుకునేందుకు వాడిన చీర కారణంగా, ఆయన మెడ నరాలు చిట్లాయని, దాంతో అక్కడి ఎముక తెగిపోయి, వెంటనే కోమాలోకి వెళ్లి ప్రాణాలు వదిలాడని తేల్చారు.

ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చిన వైద్యులు, నేడో రేపో పోస్టుమార్టం నివేదికను అందించనున్నట్టు తెలుస్తోంది. కాగా, విజయ్ తండ్రి కేవీ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు, కేసును దర్యాఫ్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
Vijay Sai
Tollywood
Actor
Sucide

More Telugu News