బురఖాలో వచ్చి.. హైదరాబాద్‌లోని లలితా జ్యూవెలర్స్‌లో చోరీ!
- రూ.6 లక్షల విలువైన బంగారు హారాన్ని కొట్టేసిన ఇద్దరు మహిళలు
- బంగారు హారం స్థానంలో రోల్డ్ గోల్డ్ హారం ఉంచిన వైనం
- సీసీటీవీ కెమెరా సాయంతో గుర్తింపు
బురఖా ధరించి హైదరాబాద్‌లోని పంజాగుట్ట లలితా జ్యువెలర్స్ లోకి వచ్చిన ఇద్దరు మహిళలు రూ.6 లక్షల విలువైన బంగారు హారాన్ని కొట్టేసి జంప్ అయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన సిబ్బంది సీసీటీవీలో పరిశీలించగా సదరు మహిళలు బంగారు హారం స్థానంలో రోల్డ్ గోల్డ్ హారం ఉంచి పరారయినట్లు తెలిసింది. సదరు మహిళల కోసం పోలీసులు గాలిస్తున్నారు.