charan: చరణ్ కి నచ్చిన విధంగా కథకు రిపేర్ చేసిన బోయపాటి!

షార్ట్స్‌లో చూడండి
చరణ్ తన తదుపరి సినిమాను బోయపాటి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. కొంతకాలం క్రితమే బోయపాటి ఒక కథను చరణ్ కి వినిపించాడట. అయితే ఆ కథ పట్ల చరణ్ అంతగా ఆసక్తిని చూపించలేదు. దాంతో అదే కథను బెల్లంకొండ శ్రీనివాస్ తో చేయడానికి ప్రయత్నిస్తే కుదరలేదట. దాంతో ఆ హీరోతో 'జయ జానకి నాయక' చేశాడు.

ఆ తరువాత మళ్లీ చరణ్ కి వినిపించిన కథపై దృష్టి పెట్టిన బోయపాటి, ఆ కథలో చరణ్ కి అసంతృప్తిగా అనిపించిన విషయాలను భర్తీ చేస్తూ వచ్చాడట. ఆ తరువాత ఆ కథను చరణ్ కి వినిపించగా .. బాగుందంటూ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. అలా ముందుగా తాను వద్దనుకున్న కథనే మళ్లీ చేయడానికి చరణ్ అంగీకరించాడని అంటున్నారు. మొత్తానికి బోయపాటి ఆ స్క్రిప్ట్ పై గట్టిగానే కసరత్తు చేశాడని చెప్పుకుంటున్నారు.       
Go Back to Shorts
charan
boyapati

More Telugu News