నిర‌స‌న‌లో భాగంగా యూపీ సీఎం చిత్ర‌ప‌టాన్ని పెళ్లి చేసుకున్న అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిర‌స‌న‌లో భాగంగా యూపీ సీఎం చిత్ర‌ప‌టాన్ని పెళ్లి చేసుకున్న అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌

  • సీతాపూర్ ప్రాంతంలో వినూత్న నిర‌స‌న‌
  • తమ డిమాండ్లు ప‌రిష్క‌రించ‌క‌పోతే సీఎం ద‌గ్గ‌రికి గుర్ర‌మెక్కి వెళ్తాన‌న్న మ‌హిళ‌
  • గ‌తంలో యూపీ ప్ర‌భుత్వానికి అల్టిమేటం జారీ చేసిన అంగ‌న్‌వాడీ ఉద్యోగులు
త‌మ డిమాండ్ల‌ను తీర్చాల‌ని కోరుతూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సీతాపూర్ ప్రాంతంలో అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌లు వినూత్న రీతిలో నిర‌స‌న చేప‌ట్టారు. ఈ నిర‌స‌న‌లో భాగంగా ఓ మ‌హిళా అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ చిత్ర‌ప‌టాన్ని పెళ్లి చేసుకుంది. ఒక మ‌హిళ త‌న ముఖానికి సీఎం చిత్ర‌ప‌టాన్ని అంటించుకోగా, ఆమెను సీతాపూర్ జిల్లా మ‌హిళా అంగ‌న్‌వాడీ క‌ర్మాచారి సంఘ్ అధ్య‌క్షురాలు పెళ్లి చేసుకుంది.

శుక్ర‌వారం రోజు సీఎం ఆదిత్యానాథ్ సీతాపూర్ రానున్న నేప‌థ్యంలో వీరు నిర‌స‌నలను ఉద్ధృతం చేశారు. త‌మ డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించ‌క‌పోతే ఆయ‌న తిరిగి వెళ్లేట‌పుడు ఆయ‌న‌తో పాటు ల‌క్నో వ‌ర‌కు గుర్రం మీద వెళ్తాన‌ని అధ్య‌క్షురాలు ప్ర‌క‌టించింది. తాము అల్టిమేటం జారీ చేసి ఎనిమిది నెల‌లు దాటిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం త‌మ‌ను ప‌ట్టించుకోక పోగా, పోలీసుల‌తో లాఠీఛార్జీ చేయిస్తోంద‌ని వారు తెలిపారు.
Uttar Pradesh
yogi adithya nath
anganwadi

More Telugu News