కోలీవుడ్ లో రాశి ఖన్నా జోరు పెరగడం ఖాయమట!
- జయం రవికి జోడీగా రాశి ఖన్నా
- ఈ సినిమాలో డిఫరెంట్ రోల్
- ఆమెకి మరిన్ని ఛాన్సులు ఖాయమంటూ టాక్
ప్రస్తుతం ఆమె జయం రవి జోడీగా ఓ తమిళ సినిమా చేస్తోంది. థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రాశిఖన్నా చేస్తోన్న పాత్ర చాలా డిఫరెంట్ గా వుంటుందట. ఈ పాత్ర ఆమెకి మంచి పేరు తీసుకువస్తుందని అంటున్నారు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ ను సాధిస్తుందనీ .. దాంతో కోలీవుడ్లో రాశి ఖన్నా జోరు పెరగడం ఖాయమని చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.