ramgopak verma: పక్కనే వోడ్కా గ్లాసు పెట్టుకుని.. శ్రీదేవి పాటను శ్రద్ధగా చూస్తున్న వర్మ: వీడియో పోస్టు చేసిన ఛార్మీ

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ సినీ నటి శ్రీదేవి అంటే తనకు చాలా ఇష్టమని దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. వర్మ ఆమెను దేవతగా భావిస్తుంటాడు. వర్మకు శ్రీదేవి అంటే ఎంతిష్టమో చెబుతూ ఛార్మి తన ఇన్ స్టా గ్రాంలో ఒక వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియోలో వర్మ నేలపై కూర్చొని, పక్కనే వోడ్కా గ్లాసు పెట్టుకుని, శ్రీదేవి పాటను దీక్షగా చూస్తూ కనిపించాడు. ‘ఛాల్‌ బాజ్‌’ అనే హిందీ సినిమాలో సన్నిడియోల్ తో కలిసి ‘నా జానే కహాసే’ అంటూ సాగే పాటలో శ్రీదేవి నటించింది. ఈ పాటను వర్మ చూస్తుండగా ఛార్మీ ఈ వీడియోను తీసింది. ఈ వీడియోకు ‘భక్తుడు రామ్‌ గోపాల్‌ వర్మ! శ్రీదేవి కోసం ఇక్కడ నేలపై కూర్చొని ఉన్నారు. రాముఇజం, ఆయన ఫ్యానిజం’ అన్న వ్యాఖ్యను జతచేసింది. ఇది సోషల్ మీడియాలో వారి అభిమానులను ఆకట్టుకుంటోంది. 
Go Back to Shorts
ramgopak verma
charmi
sridevi
song

More Telugu News