ముహూర్తానికి శర్వానంద్, సుధీర్ వర్మ సినిమా రెడీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముహూర్తానికి శర్వానంద్, సుధీర్ వర్మ సినిమా రెడీ!

  • వరుసగా మూడు సినిమాలు చేయనున్న సితార ఎంటర్టైన్మెంట్స్
  •  పూజ పూర్తి చేసుకున్న మారుతి - చైతూ సినిమా
  • సోమవారం రోజున శర్వానంద్ - సుధీర్ వర్మ సినిమా ప్రారంభోత్సవం
సితార ఎంటర్టైన్మెంట్స్ వారు వరుసగా మూడు సినిమాలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మూడు సినిమాలను మారుతి .. సుధీర్ వర్మ .. నందినీ రెడ్డి దర్శకత్వంలో చేయాలని నిర్ణయించుకున్నారు. మారుతి స్క్రిప్ట్ పక్కాగా ఉండటంతో .. చైతూ హీరోగా ఈ రోజు ఉదయం ఆయన సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఇక శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ రెడీ చేసిన స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు ... చేర్పులు ఉండటం వలన ఆపారు.

అయితే శర్వానంద్ .. హను రాఘవపూడితో కలిసి సెట్స్ పైకి వెళ్లాడు. దాంతో తమ ప్రాజెక్టు ఆగిపోయిందేమోననే ప్రచారం జరుగుతుందేమోనని .. సుధీర్ వర్మ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను జరపడానికి సితార ఎంటర్టైన్మెంట్స్ వారు సిద్ధమవుతున్నారు. ఈ నెల 27వ తేదీ (సోమవారం) ముహూర్తాన్ని ఖరారు చేశారు. డేట్స్ సర్దుబాటు చేస్తూ హను రాఘవపూడి సినిమాతో పాటు దీనిని కూడా పూర్తి చేస్తానని శర్వానంద్ చెప్పినట్టుగా ఒక టాక్.     
sharvanad
sudheer varma

More Telugu News