balakrishna: బాలయ్య సినిమా కన్నా చిరూ సినిమాకి ఎక్కువ పారితోషికం అందుకుంటోన్న నయన్!

షార్ట్స్‌లో చూడండి
నయనతార ఎంత పారితోషికం అడుగుతుందోనని దర్శక నిర్మాతలు ఆలోచించడం లేదు .. ఆమె ఓకే అంటే చాలాని వాళ్లు భావిస్తున్నారు. తెలుగులో ఆమెకి గల క్రేజ్ అలాంటిది .. తమిళంలో ఆమెకి గల డిమాండ్ అలాంటిది. తమిళంలో ఏ మాత్రం ఖాళీ లేని నయనతార .. తెలుగులో చిరంజీవి .. బాలకృష్ణల సరసన చేయడానికి అంగీకరించింది. బాలకృష్ణ 'జై సింహా' సెట్స్ పై ఉండగా .. చిరంజీవి 'సైరా' సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది.

గతంలో తాను బాలకృష్ణతో చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడం వలన, ఈ సినిమాకి ఆమె 3 కోట్లు తీసుకుంటోందట. ఇక చిరంజీవితో చేస్తోన్న 'సైరా' సినిమాకి ఎక్కువ రోజులు పనిచేయాల్సి ఉంటుంది కనుక, మూడున్నర కోట్లు అందుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో కొంతమంది కథానాయికలు అందుకునే పారితోషికానికి .. నయన్ పారితోషికం రెండు రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. సీనియర్ హీరోల సరసన చేసే కథానాయికల కొరత ఉండటం .. ఉన్నవాళ్లలో నయనతారకి రెండు భాషల్లోను ఎక్కువగా క్రేజ్ ఉండటం ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.       
Go Back to Shorts
balakrishna
chiranjeevi
nayanatara

More Telugu News