శ్రీవిష్ణు క్రేజ్ ను మరింతగా పెంచే 'మెంటల్ మదిలో'!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీవిష్ణు క్రేజ్ ను మరింతగా పెంచే 'మెంటల్ మదిలో'!

  • ఈ రోజే థియేటర్స్ కి వచ్చిన 'మెంటల్ మదిలో' 
  • శ్రీ విష్ణు నటనకు ప్రశంసలు 
  • మంచి భవిష్యత్తు ఉందంటోన్న ప్రేక్షకులు
వైవిధ్యభరితమైన పాత్రలను అంగీకరిస్తూ .. వరుస విజయాలను అందుకుంటూ శ్రీవిష్ణు ముందుకు వెళుతున్నాడు. 'అప్పట్లో ఒకడుండేవాడు' .. ' ఉన్నది ఒకటే జిందగీ' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణుకి, ఈ సినిమా మరింత క్రేజ్ తీసుకురావడం ఖాయమనే టాక్ పబ్లిక్ లో నుంచి వినిపిస్తోంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు .. అరవింద్ కృష్ణ పాత్రలో నటించాడు. పాత్రకి తగిన విధంగా అమాయకంగా కనిపిస్తూ .. ఓ ప్రేమికుడిగా భావోద్వేగాలకు లోనయ్యే పాత్రలో శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడని అంటున్నారు.

 కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన మనసును కదిలించి వేయడం ఖాయమని చెబుతున్నారు. కచ్చితంగా ఇది శ్రీ విష్ణును ప్రేక్షకులకు మరింత చేరువ చేసే సినిమా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మిగతా యువ కథానాయకులకు శ్రీ విష్ణు గట్టిపోటీ ఇవ్వడం ఖాయమని చెప్పుకుంటున్నారు. వివేక్ ఆత్రేయ దర్శక ప్రతిభకు .. నిర్మాతగా రాజ్ కందుకూరి అభిరుచికి ఈ సినిమా అద్దం పడుతుందని అంటున్నారు.   
sri vishnu
niveda

More Telugu News