ముందుగా రమ్యకృష్ణ చేయనన్నారు .. రెజీనా కారణంగా ఓకే అన్నారు: 'బాలకృష్ణుడు' దర్శకుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముందుగా రమ్యకృష్ణ చేయనన్నారు .. రెజీనా కారణంగా ఓకే అన్నారు: 'బాలకృష్ణుడు' దర్శకుడు

  • ఓ ముఖ్యమైన పాత్ర కోసం రమ్యకృష్ణను అనుకున్నాం 
  • ఆమె పాత్ర ప్రత్యేక ఆకర్షణ అవుతుంది
  • రెజీనా చాలా హెల్ప్ చేసింది    
నారా రోహిత్ హీరోగా దర్శకుడు పవన్ మల్లెల 'బాలకృష్ణుడు' సినిమాను తెరకెక్కించారు. రెజీనా కథానాయికగా నటించిన ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఐ డ్రీమ్స్ తో పవన్ మల్లెల మాట్లాడారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన పాత్రను గురించి ఆయన ప్రస్తావించారు. "ముందుగా మేం కథను చెప్పినప్పుడు రమ్యకృష్ణగారు చేయనని చెప్పేశారు" అని అన్నారు.

 "ఆ తరువాత రెజీనా దగ్గర రమ్యకృష్ణ ప్రస్తావనను తీసుకొచ్చాం. పాత్ర నిడివి ఎంత అనే విషయాన్ని పక్కన పెడితే .. ఆ పాత్రకి రమ్యకృష్ణ అయితేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాం. దాంతో రమ్యకృష్ణతో మాట్లాడి ఆమె ఆ పాత్ర చేయడానికి అంగీకరించేలా రెజీనా ఒప్పించారు. ఈ విషయంలో రెజీనా చాలా హెల్ప్ చేశారనే చెప్పాలి. రమ్యకృష్ణ చేసిన పాత్ర ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుంది" అని చెప్పుకొచ్చారు. 
nara rohith
regina
ramyakrishna

More Telugu News