పవన్ నిర్మిస్తోన్న సినిమా షూటింగ్ .. ఊటీలో!
- పవన్ బ్యానర్ పై నితిన్ సినిమా
- కథను అందించిన త్రివిక్రమ్
- షూటింగ్ దశలో సినిమా
- త్వరలోనే టైటిల్ ఖరారు
కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం ఊటీలో షూటింగు జరుపుకుంటోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ కథను అందించడం ప్రధాన బలంగా మారింది. ఇక తమన్ అందించిన సంగీతం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారుతుందని అంటున్నారు. త్రివిక్రమ్ .. పవన్ .. నితిన్ మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన ఈ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది. త్వరలోనే ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేయనున్నారు.