nara rohith: బాలకృష్ణకి మా టైటిల్ బాగా నచ్చేసింది: నారా రోహిత్

షార్ట్స్‌లో చూడండి
నారా రోహిత్ తాజా చిత్రంగా 'బాలకృష్ణుడు' తెరకెక్కింది. ఈ సినిమా ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతూ వుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో నారా రోహిత్ బిజీగా వున్నాడు. అలా తాజాగా ఆయన ఐ డ్రీమ్స్  ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సినిమా టైటిల్ చూస్తుంటే .. మాకు బాలకృష్ణగారు గుర్తుకొస్తున్నారు. ఈ టైటిల్ గురించి బాలకృష్ణ గారికి చెప్పారా? .. ఆయన ఏమన్నారు" అనే ప్రశ్న నారా రోహిత్ కి ఎదురైంది.

అందుకు ఆయన స్పందిస్తూ .. "నేను చెప్పలేదు గానీ .. దర్శకుడు పవన్ మల్లెల బాలకృష్ణను కలిశారు. టైటిల్ చూసిన బాలకృష్ణ .. ఇదేంటి ఈ టైటిల్ ఇంతవరకూ ఎవరూ పెట్టలేదా? అని అన్నారట. "లేదు సార్ అంటే .. బాగుంది టైటిల్ .. పెట్టేయండి" అంటూ మెచ్చుకున్నారట. బాలకృష్ణ వంటి పెద్ద హీరో ఈ సినిమా టైటిల్ పట్ల సంతృప్తిని వ్యక్తం చేయడం ఆనందంగా వుంది" అని చెప్పుకొచ్చారు. 
Go Back to Shorts
nara rohith
regina

More Telugu News