nayanatara: 'అదిరింది' తరువాత నయనతార మూవీతో శరత్ మరార్

షార్ట్స్‌లో చూడండి
పవన్ కల్యాణ్ తో భారీ సినిమాలను నిర్మించిన శరత్ మరార్ .. తమిళంలో భారీ విజయాలను అందుకున్న సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఇటీవల తమిళంలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న 'మెర్సల్' సినిమాను, తెలుగులో 'అదిరింది' పేరుతో విడుదల చేశారు. ఈ సినిమా ఆయనకి మంచి ఓపెనింగ్స్ ను తెచ్చిపెట్టింది.

 ఈ నేపథ్యంలో ఆయన నయనతార తాజా చిత్రం 'అరామ్'పై దృష్టి పెట్టారు. రీసెంట్ గా తమిళంలో విడుదలైన ఈ సినిమా, అక్కడ భారీ సక్సెస్ ను దక్కించుకుంది. దాంతో ఈ సినిమా తెలుగు హక్కులను కూడా శరత్ మరార్ దక్కించుకున్నారట. ఈ సినిమాను తెలుగులో 'కర్తవ్యం' టైటిల్ తో విడుదల చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. కలెక్టర్ గా నయనతార నటించిన ఈ సినిమా, ఇక్కడ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.   
Go Back to Shorts
nayanatara

More Telugu News