టీడీపీలో చేరనున్న జీవిత, రాజశేఖర్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీడీపీలో చేరనున్న జీవిత, రాజశేఖర్?

  • చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన జీవిత
  • పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం
  • మొదట్లో టీడీపీలోనే ఉన్న జీవిత, రాజశేఖర్
2019 ఎన్నికల నేపథ్యంలో పార్టీకి మరింత సినీ గ్లామర్ అద్దడానికి టీడీపీ నాయకత్వం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. మరోవైపు, 'గరుడ వేగ' సినిమా హిట్ తో మంచి జోష్ మీదున్న జీవిత, రాజశేఖర్ లు మళ్లీ రాజకీయ ప్రవేశానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పటికే పలు పార్టీలలో పనిచేసిన వీరు... మళ్లీ టీడీపీలోకి వస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై జీవిత ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా మీరు టీడీపీలోకి చేరనున్నారా? అంటూ ఆమెను ప్రశ్నిస్తే... చేరమంటే, చేరుతానంటూ ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. మరోవైపు వీరిని పార్టీలోకి చేర్చుకోవడానికి టీడీపీ కూడా సిద్ధంగానే ఉన్నట్టు సమాచారం. మొదట్లో జీవిత, రాజశేఖర్ లు టీడీపీ సానుభూతిపరులుగానే వుండేవారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ లో చేరారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. ఆ తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రతిఫలంగా జీవితకు సెన్సార్ బోర్డు పదవి దక్కింది. ఈ నేపథ్యంలో, వీరు యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. తాజాగా, మళ్లీ సొంత పార్టీ అయిన టీడీపీలో చేరేందుకు వీరు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. 
jeevitha
rajasekhar
Chandrababu
Telugudesam
jeevitha to join Telugudesam

More Telugu News