Virat Kohli: దటీజ్ కోహ్లీ!.. బంతి తగలి టీవీ సిబ్బందికి గాయమైతే ప్రాక్టీస్ ఆపేసి ప్రథమ చికిత్స!

షార్ట్స్‌లో చూడండి
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాను ఎందుకంత స్పెషలో మరోమారు నిరూపించాడు. బ్యాటింగ్ విషయంలోనే కాదు మైదానంలోని ప్రేక్షకుల విషయంలోనూ కేర్ తీసుకుంటానని నిరూపించాడు. రేపటి నుంచి శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జట్టు సభ్యులు ప్రాక్టీస్ చేస్తున్నారు.

నెట్స్‌లో మహ్మద్ షమీ వేస్తున్న బంతులను కోహ్లీ ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఓ బంతి మిస్సయింది. అది నేరుగా వెళ్లి నెట్ ప్రాక్టీస్‌ను చిత్రీకరిస్తున్న ఓ టీవీ చానల్ ప్రతినిధి నుదుటికి తాకింది. అంతే, అతడు కిందపడ్డాడు. ఇది గమనించిన కోహ్లీ వెంటనే బ్యాటింగ్ ఆపేసి పరుగు పరుగున అతడిని చేరుకుని ప్రథమ చికిత్స అందించాడు. ఆ తర్వాత షమీ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఆ వెంటనే జట్టు ఫిజియోను పిలిచి చికిత్స అందించాలని ఆదేశించాడు. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ అతడికి పూర్తిస్థాయిలో వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇచ్చాడు.
Go Back to Shorts
Virat Kohli
Eden Gardens
Kolkata

More Telugu News