'బాలకృష్ణుడు'లో గ్లామర్ డోస్ పెంచేసిన రెజీనా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బాలకృష్ణుడు'లో గ్లామర్ డోస్ పెంచేసిన రెజీనా

  • నారా రోహిత్ హీరోగా 'బాలకృష్ణుడు' 
  • కథానాయికగా రెజీనా 
  • ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు     
నారా రోహిత్ కథానాయకుడిగా దర్శకుడు పవన్ మల్లెల 'బాలకృష్ణుడు' సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. రోహిత్ సరసన కథానాయికగా రెజీనా నటించింది. ఈ సినిమాలో ఆమె గ్లామర్ డోస్ పెంచేసిందనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో జోరుగా షికారు చేస్తోంది. కొంతకాలం క్రితం వచ్చిన 'రారా కృష్ణయ్య' లోను .. రీసెంట్ గా వచ్చిన 'నక్షత్రం' సినిమాలోను రెజీనా అందాలను బాగానే ఆరబోసింది.

అయినా ఆ సినిమాలు ఆమె కెరియర్ కి పెద్దగా హెల్ప్ కాలేదు. ముఖ్యంగా 'నక్షత్రం' సినిమాలో గ్లామర్ పరంగా ఆకట్టుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నానికే గుర్తింపు లభించలేదు. దాంతో 'బాలకృష్ణుడు'లో మరింతగా గ్లామర్ డోస్ పెంచిందని చెబుతున్నారు. కొత్తగా వస్తోన్న పోస్టర్లు కూడా అది నిజమేననే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ సినిమా అయినా ఆమెకు మరిన్ని ఛాన్సులు తెచ్చిపెడుతుందేమో చూడాలి మరి.       
nara rohith
regina

More Telugu News