మొదట్లో నాకు నత్తి బాగా వుండేది.. మెల్లిగా సరిచేసుకుంటూ వచ్చాను!: రాజశేఖర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మొదట్లో నాకు నత్తి బాగా వుండేది.. మెల్లిగా సరిచేసుకుంటూ వచ్చాను!: రాజశేఖర్

  • రేపే ప్రేక్షకుల ముందుకు 'గరుడవేగ'
  • ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్న రాజశేఖర్ 
  • హీరోయిన్లతో నటించాల్సి వస్తే ఇప్పటికీ సిగ్గే! 
  • మా పిల్లలు కూడా అదే మాట అంటారు  
రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన 'గరుడవేగ' సినిమా .. రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజశేఖర్ .. ప్రమోషన్స్ తో బిజీగా వున్నారు. తాజా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. తాను వదులుకున్న భారీ సినిమాలను గురించే కాకుండా, తన బలహీనతలను గురించి కూడా చెప్పారు.

 కెరియర్ ఆరంభంలో తనకి బాగా నత్తి వుండేదనీ, ఆ తరువాత మెల్లిగా సరిచేసుకుంటూ వచ్చానని అన్నారు. ఈ విషయంలో ముందుగా నా పై డౌట్ వ్యక్తం చేసినవారే, ఆ తరువాత తనతో వరుస సినిమాలను నిర్మించారని చెప్పారు. ఇక ఇన్ని సినిమాలు చేసినా హీరోయిన్ తో నటించాల్సి వచ్చేసారి తనకి కాస్త సిగ్గుగానే ఉంటుందని అన్నారు. హీరోయిన్ తో కల్సి యాక్ట్ చేసేటప్పుడు ఎందుకు అలా బిగుసుకుపోతారు? అంటూ తన పిల్లలు కూడా అంటూ ఉంటారని చెప్పారు. ఆ బలహీనతను కూడా సరిదిద్దుకునే ప్రయత్నంలోనే ఉన్నానంటూ నవ్వేశారు.   
rajasekhar

More Telugu News