వర్షం పాట విషయంలో గొడవ .. ముఖం మీద కొట్టినట్టుగా ఆ హీరోకి చెప్పేశాను: ప్రగతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వర్షం పాట విషయంలో గొడవ .. ముఖం మీద కొట్టినట్టుగా ఆ హీరోకి చెప్పేశాను: ప్రగతి

  • వర్షం పాటకి ప్లాన్ చేశారు 
  • పల్చటి చీర కట్టుకోమంటే నో చెప్పాను 
  • ఆ హీరోకి కోపం వచ్చేసింది 
  • నేను కూడా ఊరుకోలేదు      
ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ క్యారెక్టర్ నటి ప్రగతి మాట్లాడుతూ .. తన కెరియర్లో మరిచిపోలేని ఒక సంఘటన గురించి ప్రస్తావించారు. " తమిళంలో ఒక హీరోతో సినిమా చేయవలసి వచ్చింది .. ఆయనది చాలా చీప్ మెంటాలిటీ. ఆయనే ఆ సినిమాకి దర్శక నిర్మాత కూడా. వర్షంలో ఒక సాంగ్ ను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఆ పాటలో వేసుకోమంటూ కాస్ట్యూమర్ ఓ పల్చటి వైట్ శారీ ఇచ్చాడు".

" ఆ చీర నేను కట్టుకోనని చెప్పాను .. దాంతో ఈ విషయం ఆ హీరోకి చేరిపోయింది. ఆయన వచ్చి అడిగినా అదే మాట చెప్పాను. దాంతో ఆయన అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయి .. మాధురీ దీక్షిత్ వేసుకోలేదా .. శ్రీదేవి వేసుకోలేదా? .. అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడటం మొదలుపెట్టాడు. అంతే నేను కోపంగా వెళ్లి .. ఏవైనా మాట్లాడదలచుకుంటే నాతో మాట్లాడు .. రోడ్డుపై కాదు. ఏ రజనీకాంతో .. కమలహాసనో అయితే ఆ చీర కట్టుకునేదాన్నేమో .. నీ ముఖానికి నేను వేసుకోను. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో .. అంటూ ముఖం మీద కొట్టేసినట్టుగా చెప్పేసి కారెక్కేసి వెళ్లిపోయాను" అంటూ ఆనాటి సంఘటనను వివరించారు.     
pragathi

More Telugu News