చెన్నై వదిలే ఛాన్సే లేదనుకున్నాను .. కానీ హైదరాబద్ వచ్చేశాను: ప్రగతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెన్నై వదిలే ఛాన్సే లేదనుకున్నాను .. కానీ హైదరాబద్ వచ్చేశాను: ప్రగతి

  • చెన్నై లో పుట్టి పెరిగాను
  • అక్కడే చదువుకున్నాను 
  • హీరోయిన్ గా అక్కడే కెరియర్ మొదలైంది 
  • హైదరాబాద్ వస్తానని అనుకోలేదు    
తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరియర్ కి సంబంధించిన విషయాలను ప్రగతి ప్రస్తావించారు. " మొదట్లో నేను తమిళంలో హీరోయిన్ గా కెరియర్ ను మొదలుపెట్టాను. ఆ తరువాత తమిళ సీరియల్స్ .. తెలుగు సీరియల్స్ చేస్తూ వచ్చాను. అప్పుడు .. చెన్నై వదిలే ఛాన్సే లేదు .. హైదరాబాద్ వెళ్లడం ఇంపాజిబుల్ అనుకున్నాను"

"నేను పుట్టి పెరిగింది చెన్నైలో .. చదువుకున్నది చెన్నైలో .. వర్క్ చేస్తున్నది అక్కడే .. ఇక హైదరాబాద్ ఏం పని అనుకున్నాను. కానీ ఆ తరువాత ఇక్కడికి షిఫ్ట్ కావడం .. ఇక్కడే స్థిరపడటం జరిగిపోయాయి" అని అన్నారు. " సినిమాల్లోకి రావడం వలన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేకపోయాననీ .. ఇక ఇప్పుడు పూర్తి చేయాలనే ఆలోచన .. అందుకు తగిన సమయం కూడా లేవు" అని చెప్పుకొచ్చారు.         
pragathi

More Telugu News