నా కెరియర్ మలుపు తిరగడానికి ఆమెనే కారణం : నటి ప్రగతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా కెరియర్ మలుపు తిరగడానికి ఆమెనే కారణం : నటి ప్రగతి

  • సురేశ్ ప్రొడక్షన్స్ వారు మదర్ రోల్ చేయమన్నారు 
  • అంత చిన్న వయసులో తల్లి పాత్ర చేయడం ఇష్టం లేదు 
  • అయిష్టంగానే ఒప్పుకున్నాను
తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రగతి మాట్లాడుతూ .. తాను 24 .. 25 సంవత్సరాల వయసులోనే తల్లి పాత్రల వైపు రావడానికి గల కారణాన్ని వివరించారు. " నేను 'అక్కాచెల్లెళ్లు' సీరియల్ చేస్తుండగా 'సురేశ్ ప్రొడక్షన్స్' నుంచి కాల్ వచ్చింది. తాము నిర్మించనున్న కొత్త సినిమాలో హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ కి మదర్ గా నటించవలసి ఉంటుందని చెప్పారు. ఆ మాట విని నేను షాక్ అయ్యాను .. నన్ను మదర్ కేరక్టర్ కి పిలుస్తారా .. అనే ఉద్దేశంతో .. తరువాత ఫోన్ చేస్తానంటూ ముభావంగా పెట్టేశాను".

" ఆ సీరియల్ లో నాకు మదర్ రోల్ చేస్తోన్న శ్రీ విద్యగారు ఆ సమయంలో నా ఎదురుగానే వున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్  నుంచి కాల్ వచ్చిందంటూ ఆమెకి విషయం చెప్పాను. అప్పుడామె .. "ఇదిగో చూడు ఒకటి నువ్ కేరక్టర్ ఆర్టిస్ట్ గా వుండాలనుకో .. లేదంటే హీరోయిన్ ను కావాలనుకో. కేరక్టర్ ఆర్టిస్ట్ ను అనుకుంటే అమ్మ . . అక్క .. వదిన .. ఎవరైతే ఏంటి? లేదంటే హీరోయిన్ గా ఛాన్సులు వచ్చేవరకూ వెయిట్ చేయ్" అన్నారు. "అలా కాదు .. " అంటూ నేను నసిగాను. " సురేశ్ ప్రొడక్షన్స్ చాలా పెద్ద కంపెనీ .. సినిమా ఎలా వున్నా నీకు మంచి పేరు వస్తుంది .. ఇప్పుడు ఫోన్ చేసి నువ్ ఆ పాత్ర చేస్తున్నట్టుగా చెప్పు" అంటూ పట్టుబట్టారు. దాంతో శ్రీవిద్యగారు చెప్పినట్టు చేశాను .. ఈ రోజున ఇక్కడ వున్నాను. నా కెరియర్ మలుపు తిరగడానికి ఆమెనే కారణం" అని చెప్పుకొచ్చారు.          
pragathi

More Telugu News