నిజం .. నమ్మండి .. నితిన్ తో లవ్ లో పడలేదు!: హీరోయిన్ మేఘ ఆకాశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిజం .. నమ్మండి .. నితిన్ తో లవ్ లో పడలేదు!: హీరోయిన్ మేఘ ఆకాశ్

  • నితిన్ తో 'లై' మూవీ చేసిన మేఘ ఆకాశ్ 
  • తదుపరి సినిమా కూడా నితిన్ జోడీగానే 
  • ఈ నేపథ్యంలో మొదలైన ప్రచారం 
  • దానిపై స్పందించిన మేఘ ఆకాశ్  
మేఘ ఆకాశ్ తెలుగు తెరకు 'లై' సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైంది. ఆ తరువాత సినిమాను కూడా ఆమె నితిన్ జోడీగానే చేస్తోంది. ఈ నేపథ్యంలో నితిన్ - మేఘ ఆకాశ్ ప్రేమలో పడ్డారనీ .. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారం అంతకంతకూ బలపడుతూ ఉండటంతో మేఘ ఆకాశ్ స్పందించింది.

'లై' సినిమాకి కొత్త కథానాయిక కావాలనుకుంటున్నప్పుడు తన పేరును నితిన్ సిఫార్స్ చేయడం వలన, కొంతమంది ఇలా ప్రచారం చేస్తున్నారని చెప్పింది. తాము ప్రేమలో పడినట్టుగా .. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టుగా వస్తోన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని అంది. తాను నితిన్ సినిమాలను మాత్రమే చేస్తానంటూ పుకార్లు పుట్టుకొస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకి నితిన్ మంచి స్నేహితుడనీ .. అంతకుమించి ఏమీ లేదనీ, ఇలాంటి ప్రచారాలు మానుకోవడం మంచిదంటూ చెప్పుకొచ్చింది.    
megha akash

More Telugu News