virat kohli: పెళ్లి చేసుకోవాలి... సెలవు ఇవ్వమని బీసీసీఐని కోరుతున్న విరాట్ కోహ్లీ!

షార్ట్స్‌లో చూడండి
భారత సెలబ్రిటీ లవర్స్ జాబితాలో అత్యధిక పాప్యులారిటీ ఎవరిదని ప్రశ్నిస్తే, తొలుత వినిపించేది విరాట్ కోహ్లీ, అనుష్కల పేర్లే. వీరిద్దరి పెళ్లిపై గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. తాజాగా వస్తున్న మరో న్యూస్ ఏంటంటే... అతి త్వరలో వీరిద్దరి పెళ్లీ ఇటలీలోని మాలాన్ లో జరగనుందట. తన పెళ్లి కోసం విరాట్ సెలవు కోరుతూ బీసీసీఐని అభ్యర్థించాడని, శ్రీలంకతో జరిగే సిరీస్ నుంచి తనను తప్పించాలని కోరాడని తెలుస్తోంది. ఈ మేరకు క్రికెట్ బోర్డుకు ఓ లీవ్ లెటర్ ను కూడా కోహ్లీ రాసినట్టు సమాచారం.

ఇక ఇదే సమయంలో అనుష్క సైతం డిసెంబర్ లో ఎలాంటి షూటింగ్ లకూ కాల్ షీట్లు ఇవ్వడం లేదట. దీంతో బాలీవుడ్ లోనూ విషయం ఏంటన్న ఆరాలు మొదలయ్యాయి. ఈ సంవత్సరం చివరిలో విరాట్, అనుష్కలు పెళ్లి చేసుకోనున్నారని, అందుకే ఇద్దరూ కనీసం నెల రోజుల పాటు తమ రోజువారీ విధులకు దూరం కావాలని భావిస్తున్నారని తెలుస్తోంది. తమపై వచ్చే వార్తలను వినడమే తప్ప, ఎక్కువగా స్పందించే అలవాటు లేని ఈ జంట... పెళ్లి, సెలవుల విషయంలోనూ ఇంకా ఏమీ స్పందించలేదు.
Go Back to Shorts
virat kohli
anushka
marriage

More Telugu News