నాకు తెలిసింది నటించడమే .. అంచనాల గురించి పట్టించుకోను : రామ్
Add ap7am to your home Screen

నాకు తెలిసింది నటించడమే .. అంచనాల గురించి పట్టించుకోను : రామ్

  • కిషోర్ తిరుమలతో రామ్ రెండో మూవీగా 'ఉన్నది ఒకటే జిందగీ'
  • కథానాయికలుగా లావణ్య త్రిపాఠి .. అనుపమ పరమేశ్వరన్ 
  • పాత్ర కోసం బాగా హోమ్ వర్క్ చేసిన అనుపమ 
  • ఈ నెల 27వ తేదీన భారీ స్థాయిలో విడుదల      
'నేను శైలజ'తో హిట్ ఇచ్చిన దర్శకుడు కిషోర్ తిరుమలతో కలిసి రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా చేశాడు. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ .. ఈ సినిమాలో తాను 'అభి' అనే పాత్రలో కనిపించనున్నట్టు చెప్పాడు. లైఫ్ ను చాలా ఈజీగా తీసుకునే స్వభావంతో తన పాత్ర ఉంటుందని అన్నాడు.

ఇక తాను ఏ సినిమా చేసినా ఆ సినిమాపై గల అంచనాలను గురించి ఎంతమాత్రం పట్టించుకోననీ, నటించడం మాత్రమే తనకి తెలుసునని చెప్పాడు. నిజ జీవితానికి దగ్గరగా వుండే పాత్ర లభించడం వలన, లావణ్య త్రిపాఠి చాలా ఈజీగా చేసేసిందని అన్నాడు. రియల్ లైఫ్ కి భిన్నంగా వుండే పాత్ర కావడం వలన అనుపమ పరమేశ్వరన్ హోమ్ వర్క్ చేయవలసి వచ్చిందని చెప్పాడు. ఇక ఈ సినిమా చేయడం వలన దర్శకుడు కిషోర్ తిరుమలపై తనకి గల నమ్మకం మరింత పెరిగిందని చెప్పుకొచ్చాడు.      
ram
anupama

More Telugu News