ఒక్కటి కాబోతున్న కోహ్లీ, అనుష్క.. డిసెంబరులో వివాహం!
- అనుష్క మెడలో మూడు ముళ్లు వేయనున్న కోహ్లీ
- డిసెంబరులోనే ముహూర్తం
- శ్రీలంకతో సిరీస్‌కు కోహ్లీ డౌటే!
కోహ్లీ-అనుష్కలు రెండేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. 2013లో జరిగిన ఇంగ్లండ్ టూర్‌లో అనుష్కతో కలిసి కోహ్లీ కనిపించడంతో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం వెలుగు చూసింది. అయితే 2015లో వీరిద్దరి మధ్య లవ్ బ్రేకప్ అయిందన్న వార్తలు కూడా అప్పట్లో హల్‌చల్ చేశాయి. కోహ్లీ ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నప్పుడు అనుష్క బహిరంగంగా అతడికి మద్దతు తెలిపింది.
కాగా, ఇటీవల ఇద్దరూ కలిసి ఓ యాడ్ ఫిల్మ్‌లో నటించారు. ఓ పెళ్లి వేడుకకు హాజరైన ఇద్దరూ ఒకరినొకరు ప్రపోజ్ చేసుకోవడం కనిపించింది. ఇప్పుడది నిజమై పెళ్లి పీటల వరకు చేరుతోంది. అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘విరుష్క’ వివాహం వార్తలతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.