'మహానటి' కోసం దర్శకుడు కేవీ రెడ్డి పాత్రలో క్రిష్ .. సింగీతం శ్రీనివాసరావు పాత్రలో తరుణ్ భాస్కర్
- కీర్తి సురేశ్ ప్రధాన పాత్రగా 'మహానటి'
- జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్
- ఎస్వీఆర్ గా మోహన్ బాబు
- ఆసక్తిని రేకెత్తిస్తోన్న తాజా సమాచారం
'మాయాబజార్'లోని 'వివాహ భోజనంబు .. వింతైన వంటకంబు' అనే పాటను కూడా మోహన్ బాబుపై చిత్రీకరించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 'మాయాబజార్' సినిమాకి దర్శకత్వం వహించిన కె.వి.రెడ్డి పాత్రలో క్రిష్ .. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన సింగీతం శ్రీనివాసరావు పాత్రలో తరుణ్ భాస్కర్ కనిపించనున్నారనేది తాజా సమాచారం. మొత్తానికి 'మహానటి' సినిమా నటీనటుల ఎంపికతోనే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది .. ఆసక్తిని రేకెత్తిస్తోంది.