ఎన్టీఆర్ తో కచ్చితంగా సినిమా చేస్తా : అనిల్ రావిపూడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీఆర్ తో కచ్చితంగా సినిమా చేస్తా : అనిల్ రావిపూడి

  • 'రాజా ది గ్రేట్' ప్రమోషన్స్ లో అనిల్ రావిపూడి 
  • ఎన్టీఆర్ ను కలిసిన మాట వాస్తవమే 
  • కొంత కథ వినిపించాను 
  • త్వరలోనే పూర్తి కథను వినిపిస్తాను  
వరుసగా సక్సెస్ లను అందిస్తూ ముందుకు దూసుకుపోతోన్న యువ దర్శకుల జాబితాలో అనిల్ రావిపూడి పేరు కూడా కనిపిస్తుంది. ఆయన తాజా చిత్రంగా 'రాజా ది గ్రేట్' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ తో అనిల్ రావిపూడి ఫుల్ బిజీగా వున్నాడు. గతంలో ఎన్టీఆర్ తో అనిల్ ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.

 ఆ విషయాన్ని గురించి తాజాగా ఆయన స్పందిస్తూ .. తాను ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకున్న విషయం నిజమేనని చెప్పాడు. ఎన్టీఆర్ కోసం తాను రెడీ చేసిన కథను కొంతవరకూ వినిపించడం జరిగిందనీ, ఆ తరువాత కొన్ని కారణాల వలన మిగతా కథను వినిపించలేకపోయానని అన్నాడు. త్వరలోనే ఎన్టీఆర్ కి పూర్తి కథను వినిపిస్తానని చెప్పాడు. ఎన్టీఆర్ తో కచ్చితంగా సినిమా చేస్తాననీ .. తమ కాంబినేషన్లో తప్పకుండా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు.       
anil ravipudi

More Telugu News