'మహానుభావుడు' ఫస్టు వీక్ వసూళ్లు అదుర్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మహానుభావుడు' ఫస్టు వీక్ వసూళ్లు అదుర్స్!

  •  తెలుగు రాష్ట్రాల్లో 'మహానుభావుడు' జోరు
  •  తొలివారంలో 32.2 కోట్లు వసూళ్లు
  •  50 కోట్ల మార్క్ ను తాకే అవకాశం
  •  శర్వానంద్ కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం  
దసరా పండుగ సందర్భంలో పెద్ద సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుండగానే, 'మహానుభావుడు' రంగంలోకి దిగింది. ఈ సినిమా కంటెంట్ అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో, భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. తొలివారంలో ఈ సినిమా 32.2 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా తెలిపారు.

 వసూళ్ల విషయంలో ఈ సినిమా ఇదే జోరును కొనసాగిస్తే 50 కోట్ల మార్క్ ను టచ్ చేసే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శర్వానంద్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఇది నిలవడం విశేషం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై గతంలో 'రన్ రాజా రన్' .. 'ఎక్స్ ప్రెస్ రాజా' చేసిన శర్వానంద్, 'మహానుభావుడు'తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. మెహ్రీన్ కి కూడా ఈ సినిమా సక్సెస్ బాగా కలిసొచ్చిందనే టాక్ వినిపిస్తోంది. 
sharwanand
mehreen

More Telugu News