మూడు రోజుల్లో 10 కోట్లు కొల్లగొట్టిన 'మహానుభావుడు'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూడు రోజుల్లో 10 కోట్లు కొల్లగొట్టిన 'మహానుభావుడు'

  • భారీ సినిమాల మధ్య 'మహానుభావుడు'
  • ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది  
  • కథతో ముడిపడిన కామెడీనే ప్రధాన బలం  
'జై లవ కుశ' .. 'స్పైడర్' సినిమాలు థియేటర్స్ లో ఉండగా, 'మహానుభావుడు' రంగంలోకి దిగాడు. దాంతో అంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగా, తమ సినిమా కంటెంట్ పై తమకి గల నమ్మకమే అందుకు కారణమని దర్శక నిర్మాతలు చెప్పారు. వాళ్ల నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 10 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది.

తొలి మూడు రోజుల్లో తెలంగాణ - ఆంధ్ర ప్రాంతాల్లో ఈ సినిమా 7.85 కోట్ల షేర్ ను కొల్లగొట్టగా, మిగతా ప్రాంతాలన్నీ కలుపుకుని 10 కోట్ల 30 లక్షల షేర్ ను సాధించింది. 'జై లవ కుశ' మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రాగా, 'స్పైడర్' క్లాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని వచ్చింది. ఇక యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రావడం 'మహానుభావుడు' సినిమాకి బాగా కలిసొచ్చిందని చెప్పుకుంటున్నారు.  
sharwanand
mehreen

More Telugu News