ram: 'ఉన్నది ఒకటే జిందగీ' రిలీజ్ డేట్ ఖరారు

షార్ట్స్‌లో చూడండి
రామ్ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నట్టు వార్తలు షికారు చేశాయి. దర్శక నిర్మాతలు అదే డేట్ ను ఖరారు చేశారనేది తాజా సమాచారం. లావణ్య త్రిపాఠి .. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో కథానాయికలుగా అలరించనున్నారు.

 ఈ సినిమాలో రామ్ .. అభిరామ్ అనే పాత్రలో కనిపించనున్నాడు. నలుగురు స్నేహితులతో కలిసి అయన ఒక రాక్ బ్యాండ్ ను స్టార్ట్ చేస్తాడు. వాళ్లతో ఆయన జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఇద్దరు అమ్మాయిలు  అభిరామ్ జీవితంలోకి ప్రవేశిస్తారు. దాంతో ఆయన జీవితం ఎలాంటి అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా కొనసాగుతుందట.    
Go Back to Shorts
ram
anupama

More Telugu News