'మహానుభావుడు' తొలిరోజు వసూళ్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మహానుభావుడు' తొలిరోజు వసూళ్లు

  • పండగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మహానుభావుడు' 
  • యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోన్న కంటెంట్
  •  శర్వానంద్ నటన .. మెహ్రీన్ గ్లామర్ హైలైట్        
శర్వానంద్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందిన 'మహానుభావుడు' ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక వైపున 'జై లవ కుశ' మరో వైపున 'స్పైడర్' థియేటర్స్ లో సందడి చేస్తుండగా, 'మహానుభావుడు' విడుదల కావడం విశేషం. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే కథతో ఈ సినిమాను మారుతి తెరకెక్కించాడు. ఆయన ఎంచుకున్న కంటెంట్ ఈ రెండు వర్గాల ప్రేక్షకులను థియేటర్స్ కి బాగానే రప్పిస్తోంది.

 తొలి రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3.8 కోట్ల షేర్ ను రాబట్టింది. శర్వానంద్ కెరియర్లోనే తొలి రోజున ఈ స్థాయి వసూళ్లు సాధించడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. రెండు భారీ సినిమాల మధ్య ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు దక్కడం సామాన్యమైన విషయమేం కాదని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ జోడీగా మెహ్రీన్ నటించిన సంగతి తెలిసిందే.        
sharwanand
mehreen

More Telugu News