'మహానుభావుడు' గురించి మారుతి .. అందుకే ధైర్యం చేశాడట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మహానుభావుడు' గురించి మారుతి .. అందుకే ధైర్యం చేశాడట!

  •  ఈ నెల 29న థియేటర్స్ కి 'మహానుభావుడు' 
  •  'స్పైడర్'కి పోటీగా అంటే సాహసమే 
  •  కంటెంట్ పై నమ్మకముందంటోన్న మారుతి
  •  యూత్ కి .. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందట        
మారుతి దర్శకత్వంలో రూపొందిన 'మహానుభావుడు' సినిమా, ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భారీ బడ్జెట్ తో .. భారీ అంచనాలతో 'స్పైడర్' రిలీజైన రెండవ రోజునే 'మహానుభావుడు' థియేటర్స్ కి వస్తున్నాడు. అందుకు కారణం కంటెంట్ పై తమకి గల నమ్మకమేనని మారుతి చెప్పారు. దసరా సెలవుల్లో ప్రేక్షకులు పూర్తి వినోదభరితమైన సినిమాలకు పట్టం కడతారని అన్నారు.

పండుగ రోజుల్లో కుటుంబ సమేతంగా సినిమాలకి వెళతారనీ, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ వున్న చిత్రాలకి మంచి ఆదరణ లభిస్తుందని గతంలో చాలా చిత్రాలు నిరూపించాయని చెప్పారు. సినిమా పెద్దదా .. చిన్నదా అనే విషయంపై కంటే, కంటెంట్ లోని కొత్తదనానికి ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారని అన్నారు. అలాంటి కంటెంట్ తమ సినిమాలో బలంగా వున్న కారణంగానే ధైర్యంగా ఇంత పోటీలోను వస్తున్నామని చెప్పుకొచ్చారు.         
sharwanand
mehreen

More Telugu News