ఈ సారి తాగుబోతుగా విజయ్ ఆంటోని!
ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు 'ఇంద్రసేన' రానుంది. రాధిక నిర్మించిన ఈ సినిమాలో ఆయన అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేశాడు. ఓ షాప్ కి ఓనరైన తాగుబోతు పాత్రలో అన్నయ్యగా .. బాధ్యత తెలిసిన పీఈటీ మాస్టర్ గా తమ్ముడి పాత్రలో ఆయన కనిపిస్తాడని చెబుతున్నారు. ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుందనీ .. సెకండాఫ్ కన్నీళ్లు పెట్టిస్తుందని అంటున్నారు. నవంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.