విజయ్ ఆంటోని సరసన అంజలి!
కృతికా ఉదయనిధి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇటీవల కాలంలో అంజలికి తెలుగులో అవకాశాలు బాగా తగ్గాయి. ఇక తమిళంలోను అవకాశాలు పల్చబడ్డాయి. దాంతో ఈ రెండు భాషల్లోను ఈ సినిమా తనకి బాగా హెల్ప్ అవుతుందని అంజలి ఆశ పడుతోంది. ఆమె ఆశ నెరవేరుతుందేమో చూడాలి.