'ఫిదా', 'అర్జున్ రెడ్డి' బాటలో 'మహానుభావుడు'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఫిదా', 'అర్జున్ రెడ్డి' బాటలో 'మహానుభావుడు'

మారుతి దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడిగా 'మహానుభావుడు' సినిమా రూపొందింది. శర్వానంద్ సరసన మెహ్రీన్ కథానాయికగా చేసింది. ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అయితే దసరాకి 'స్పైడర్', 'జై లవ కుశ' సినిమాలు థియేటర్స్ కి వస్తున్నాయి. అయినా 'మాహానుభావుడు' నిర్మాతలు వెనకడుగు వేయడం లేదు.

తమకి కావలసిన ధైర్యాన్ని 'ఫిదా', 'అర్జున్ రెడ్డి' సినిమాలు ఇచ్చాయనే ఉద్దేశంతో వాళ్లు వున్నారు. చిన్న సినిమాలుగా వచ్చిన 'ఫిదా', 'అర్జున్ రెడ్డి' వసూళ్ల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఆ రెండు సినిమాల లక్షణాలు తమ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని 'మహానుభావుడు' నిర్మాతలు భావిస్తున్నారట. ఈ సినిమా టీజర్ కి వచ్చిన వ్యూస్ తమ నమ్మకానికి మరింత బలాన్ని చేకూర్చాయని వాళ్లు అంటున్నారు. 'మహానుభావుడు' ఏం చేస్తాడో చూడాలి మరి.   
sharwanand
mehreen

More Telugu News