manoj: సముద్రం మధ్యలో మంచు మనోజ్ మూవీ షూటింగ్!

షార్ట్స్‌లో చూడండి
మంచు మనోజ్ హీరోగా 'ఒక్కడు మిగిలాడు' సినిమా తెరకెక్కుతోంది. ఎస్.ఎన్.రెడ్డి నిర్మాణంలో అజయ్ ఆండ్రుస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో మంచు మనోజ్ ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ గాను .. ఓ స్టూడెంట్ గాను రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఒక కీలకమైన సన్నివేశాన్ని సముద్రం మధ్య భాగంలో చిత్రీకరించారు.

పది మంది పాల్గొన్న ఈ రెస్క్యూ సీన్ ఉత్కంఠను రేకెత్తించేలా ఉంటుందని చెబుతున్నారు. ఈ సీన్ లో తాను నటించలేదనీ .. కష్టతరమైన ఈ సీన్ లో ధైర్యంగా పాల్గొన్న వాళ్లందరికీ మంచు మనోజ్ హ్యాట్సాఫ్ చెప్పాడు. రెండు వైవిధ్యభరితమైన పాత్రలను పోషించే అవకాశం రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు. త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు.    
Go Back to Shorts
manoj
regina

More Telugu News