రగిలిపోతున్న ఇరాన్.. ఒమన్, సిరియా, కువైట్‌లలోని అమెరికా స్థావరాలపై ఉద్ధృత దాడులు!
- కువైట్‌పై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు
- పలువురు కువైట్ సైనికులకు తీవ్ర గాయాలు
- ప్రధాన విద్యుత్, మంచినీటి ప్లాంట్ ధ్వంసం
- సిరియా, ఒమన్‌లలోని అమెరికా స్థావరాలూ టార్గెట్
- సార్వభౌమాధికార ఉల్లంఘనపై కువైట్ తీవ్ర ఆగ్రహం
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు పొరుగు దేశాలకు వేగంగా వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం కువైట్‌పై ఇరాన్ దళాలు జరిపిన భీకర డ్రోన్, క్షిపణి దాడుల్లో పలువురు కువైట్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. కువైట్ ఆర్మీకి చెందిన పలు సైనిక శిబిరాలు, కీలక వసతులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు కువైట్ సైన్యం సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. అయితే గాయపడిన సైనికుల సంఖ్య, వారి పరిస్థితి ఎలా ఉందనే వివరాలను మాత్రం సైన్యం వెల్లడించలేదు.
మంచినీటి, విద్యుత్ ప్లాంట్ల ధ్వంసం
ఇరాన్ జరిపిన ఈ దాడుల వల్ల కువైట్‌లోని ఒక ప్రధాన విద్యుత్ ఉత్పాదన, మంచినీటి శుద్ధీకరణ (డీశాలినేషన్) ప్లాంట్‌లో భారీగా మంటలు చెలరేగి, ప్లాంట్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు కువైట్ విద్యుత్, ఇంధన శాఖ తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలంతా విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇరాన్ జరిపిన ఈ దాడులను కువైట్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తమ రక్షణ కోసం ఎలాంటి చర్యలకైనా సిద్ధమని హెచ్చరించింది.
మూడు దేశాల్లోని అమెరికా బేస్‌లపై దాడులు
ఈ దాడులపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) స్పందిస్తూ.. తాము కువైట్, సిరియా, ఒమన్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులు చేసినట్లు ప్రకటించింది. 'ఆపరేషన్ నస్ర్-2' లో భాగంగా సిరియాలోని అల్-తాన్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా స్పెషల్ ఫోర్సెస్ కమాండ్ సెంటర్‌పై, ఒమన్‌లోని నిఘా రాడార్ కేంద్రాలపై ముప్పేట దాడులు చేశామని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఇర్నా వెల్లడించింది. అలాగే కువైట్‌లో అమెరికా దళాలు ఉన్న బేస్‌ను టార్గెట్ చేస్తూ.. అక్కడి క్షిపణి రక్షణ రాడార్, ఆయుధ డిపోలు, రెండు హైమార్స్ లాంచర్లను పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది.