ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోరం.. క్యాబ్ డ్రైవర్ ఛాతీ దూసుకెళ్లిన ట్రాలీ ఆటోలోని ఇనుప రాడ్!

Dwarka Expressway horror Iron rod from trolley auto pierces cab driver chest
  • ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై క్యాబ్, ట్రాలీ ఆటో ఢీకొనడంతో ప్రమాదం
  • ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన వేగంగా వచ్చిన క్యాబ్
  • ఆటోలోని ఇనుప రాడ్లు కారు అద్దం చీల్చుకుంటూ లోపలికి
  • డ్రైవర్ ఛాతీలోకి రాడ్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై హృదయవిదారక ఘటన జరిగింది. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ఒక క్యాబ్ .. ప్రమాదకరంగా ఇనుప రాడ్లను మోసుకెళ్తున్న ట్రాలీ ఆటోను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. గురుగ్రామ్-ఢిల్లీ సరిహద్దు సమీపంలో జరిగిందీ ఘటన. ఈ ప్రమాదంలో క్యాబ్ వేగంగా వెళ్లి ఆటోను ఢీకొనడంతో, ఆటో వెనుక భాగం నుంచి బయటకు చొచ్చుకువచ్చిన ఒక పొడవైన ఇనుప కడ్డీ క్యాబ్ ముందు అద్దాన్ని (విండ్‌షీల్డ్) చీల్చుకుంటూ లోపల ఉన్న డ్రైవర్ ఛాతీలోకి బలంగా దూసుకెళ్లింది.

ఇనుప రాడ్ శరీరంలోకి లోతుగా దిగబడటంతో క్యాబ్ డ్రైవర్ కారులోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వాహనంలో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని అత్యంత శ్రమతో బయటకు తీశారు. మృతుడిని ఢిల్లీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా అంత పొడవైన ఇనుప రాడ్లను ఆటో రిక్షాలో ప్రమాదకరంగా తరలించడంపై పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అలాగే క్యాబ్ వేగంపై కూడా ఆరా తీస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన వాహనాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 
Advertisement
Dwarka Expressway
Gurugram Road Accident
Delhi Cab Driver Death
Iron Rod Accident
Trolley Auto Collision
Delhi Gurugram Border

More Telugu News