తెలుగు సినిమా హిందీ రీమేక్ లో సన్నీలీయోన్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు సినిమా హిందీ రీమేక్ లో సన్నీలీయోన్?

తెలుగు తెరపై చాలా సస్పెన్స్ థ్రిల్లర్స్ సందడి చేశాయి. కంటెంట్ గల సినిమాలు మాత్రం ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. వాటిలో కొన్ని ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో 'ఏ ఫిల్మ్ బై అరవింద్' ఒకటిగా కనిపిస్తుంది. 2005 లో వచ్చిన ఈ సినిమా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది.

 అలాంటి ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి దర్శకుడు శేఖర్ సూరి ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగులో షెర్లిన్ చోప్రా చేసిన పాత్రకి సన్నీలియోన్ అయితేనే సరిగ్గా సరిపోతుందని ఆయన భావిస్తున్నాడు. ఆమెనే ఈ పాత్రకి న్యాయం చేయగలదని భావించి సంప్రదింపులు జరుపుతున్నాడు. మరి సన్నీలియోన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో .. ఒక వేళ ఇస్తే హిందీలోను ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేస్తుందేమో చూడాలి.     
sunny leone

More Telugu News