సీన్ రివర్స్... జల్లికట్టుకు మద్దతు ప్రకటించిన హీరోయిన్ త్రిష
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీన్ రివర్స్... జల్లికట్టుకు మద్దతు ప్రకటించిన హీరోయిన్ త్రిష

మొదట్లో జల్లికట్టు క్రీడను వ్యతిరేకించిన హీరోయిన్ త్రిష ఈ రోజు ఆ క్రీడ‌కు మ‌ద్ద‌తు పలికింది. నాలుగు రోజులుగా చెన్న‌య్‌లోని మెరీనా బీచ్‌లో త‌మిళ ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లో పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ రోజు అక్క‌డకు చేరుకున్న త్రిష జ‌ల్లిక‌ట్టుపై సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని ఎత్తివేయాల‌ని కోరింది. మ‌రికాసేప‌ట్లో ఆమె మీడియా స‌మావేశంలో పాల్గొనే అవ‌కాశం ఉంది. ఇండియాస్ యానిమ‌ల్ రైట్స్ ఆర్గ‌నైజేష‌న్ త‌ర‌ఫున జ‌ల్లిక‌ట్టుకి వ్య‌తిరేకంగా కొన్ని రోజుల క్రితం త్రిష త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఓ పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ పోస్ట్‌పై త‌మిళులు తీవ్ర స్థాయిలో మండిప‌డ‌డంతో ఆమె త‌న తీరుని మార్చుకుంది. ఇప్పుడు ఏకంగా జ‌ల్లిక‌ట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాల‌ని కోరుతోంది.
jallikattu

More Telugu News