సాకర్ స్టార్ మెస్సీ నుంచి మోహన్ లాల్ కు అపురూపమైన కానుక

  • మెస్సీ సంత‌కం చేసిన జెర్సీని అందుకున్న‌ట్లు 'ఎక్స్'లో పోస్ట్‌
  • త‌న హృద‌యం ఆనందంతో నిండిపోయింద‌న్న మోహ‌న్ లాల్‌
  • ఈ కానుకను తాను జీవితాంతం ప‌దిల‌ప‌ర‌చుకుంటాన‌ని వ్యాఖ్య‌
ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్ లాల్ త‌న అభిమాన ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ లియోన‌ల్ మెస్సీ నుంచి ప్ర‌త్యేక కానుక అందుకున్నారు. మెస్సీ సంత‌కం చేసిన జెర్సీని అందుకున్న‌ట్లు 'ఎక్స్' (ట్విట్ట‌ర్)లో పోస్ట్ చేశారు. గిఫ్ట్ ప్యాక్ తెరుస్తున్న క్ష‌ణం త‌న హృద‌యం ఆనందంతో నిండిపోయింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ కానుకను తాను జీవితాంతం ప‌దిల‌ప‌ర‌చుకుంటాన‌ని మోహ‌న్ లాల్ తెలిపారు.  

"ఇలాంటి మ‌ధుర క్ష‌ణాలు జీవితాంతం మ‌న‌తోనే ఉంటాయి. వీటిని నేను ఆస్వాదిస్తున్నా. జెర్సీపై మెస్సీ నా పేరును రాసి పంపారు. గిఫ్ట్ ప్యాక్ తెరుస్తున్న స‌మ‌యంలో మెస్సీ సంత‌కం ఉన్న జెర్సీ చూసి నా హృద‌యం ఆనందంతో నిండిపోయింది. క్రీడాకారుడిగానే కాకుండా వ్య‌క్తిగ‌తంగానూ ఆయ‌న్ని ఎంతో అభిమానించే నాలాంటి వ్య‌క్తికి ఇది ఎంతో ప్ర‌త్యేకం. నా స్నేహితులు రాజీవ్‌, రాజేశ్ వ‌ల్లే ఇది సాధ్య‌మైంది. వారికి నా ధ‌న్య‌వాదాలు" అని రాసుకొచ్చారు. 


More Telugu News