Chandrababu Naidu: ఏపీలో 14 కొత్త ప్రాజెక్టులు ఇవే... గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎస్ఐపీబీ

Chandrababu Naidu Approves 14 New Projects in Andhra Pradesh
  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 14వ ఎస్ఐపీబీ సమావేశం
  • రాష్ట్రంలో రూ.19,391 కోట్ల విలువైన 14 ప్రాజెక్టులకు ఆమోదం
  • కొత్త పరిశ్రమల ద్వారా 11,753 మందికి ఉద్యోగ అవకాశాలు
  • ఇంధనం, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో భారీ పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) 14వ సమావేశంలో భారీ పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో మొత్తం రూ.19,391 కోట్ల విలువైన 14 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటి ద్వారా రాష్ట్రంలో 11,753 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

ఆమోదించిన పెట్టుబడులు, ఉద్యోగాల వివరాలివే...

• ఆర్ణ కోస్టల్ రిసార్ట్స్-బాపట్ల జిల్లా-రూ. 187.58 కోట్లు-250 ఉద్యోగాలు
• సైవెన్, యూనిఫై కన్సార్షియం-బాపట్ల జిల్లా-రూ. 183.87 కోట్లు-196 ఉద్యోగాలు
• శుభం, ఇంద్రనీర్ కన్సార్షియం-బాపట్ల జిల్లా-రూ. 64.44 కోట్లు-100 ఉద్యోగాలు
• ఇస్కాన్-సత్యసాయి జిల్లా- రూ. 425.20 కోట్లు-1035 ఉద్యోగాలు
• సంఘం మిల్క్ ప్రొడ్యూసర్స్-అనంతపురం జిల్లా -రూ. 200.82 కోట్లు-245 ఉద్యోగాలు
• నవ ఫుడ్ సెంటర్-తిరుపతి జిల్లా- రూ. 44.42 కోట్లు-500 ఉద్యోగాలు
• వెబ్ సోల్ రెన్యూవబుల్-నాయుడుపేట-రూ. 3538 కోట్లు-1980 ఉద్యోగాలు
• టాటా పవర్-నెల్లూరు జిల్లా-రూ. 6675 కోట్లు-1000 ఉద్యోగాలు
• రామ్ కో సిమెంట్స్- నంద్యాల జిల్లా-రూ. 1500 కోట్లు-300 ఉద్యోగాలు
• షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ -కడప జిల్లా-రూ. 5571 కోట్లు-5000 ఉద్యోగాలు
• ఎథిరియల్ ఎక్స్ ప్లోరేషన్ గిల్డ్-తిరుపతి జిల్లా-రూ. 578 కోట్లు-382 ఉద్యోగాలు
• పయనీర్ క్లీన్ యాంప్స్-చిత్తూరు జిల్లా-రూ. 159 కోట్లు-600 ఉద్యోగాలు
• రాధికా వెజిటబుల్స్ ఆయిల్స్ -విజయనగరం జిల్లా-రూ. 234 కోట్లు-165 ఉద్యోగాలు
• రిలయెన్స్ కన్స్యూమర్స్-అనకాపల్లి జిల్లా- రూ. 30 కోట్లు.




Chandrababu Naidu
Andhra Pradesh
AP investments
SIPB
industrial development
new projects AP
AP jobs
Tata Power
Ramco Cements
renewable energy

More Telugu News